బడా భీంగల్ లో తాళాలు వేసిన ఇళ్లల్లో చోరీ

భీంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడా భీంగల్ గ్రామ ప్రధాన కూడలి వద్ద గల తాళలు వేసి ఉన్న రెండ్లు ఇండ్లల్లో శనివారం రాత్రి దొంగలు పడ్డారు.

Update: 2024-03-10 15:49 GMT

దిశ, భీంగల్ : భీంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడా భీంగల్ గ్రామ ప్రధాన కూడలి వద్ద గల తాళలు వేసి ఉన్న రెండ్లు ఇండ్లల్లో శనివారం రాత్రి దొంగలు పడ్డారు. రాత్రి 2.15 గంటల సమయం లో మాస్కులు ధరించిన ముగ్గురు యువకులు ఈ దొంగతానానికి పాల్పడ్డారు. తాళాలు వేసి ఉన్న రెండు ఇండ్ల తాలాలు పగలగొట్టి లోనికి ప్రవేశించి గంటన్నర పాటు గా ఆ రెండు ఇండ్లలో ఉన్న బీరువాలను పగలగొట్టి బీరువాలోని వస్తువులు అన్నీ చిందర వందరగా పారేసి జంగం రాజేశ్వరి ఇంట్లో 8 తులాల బంగారాన్ని, కొంత నగదును, జంగం రాజేశ్వర్ ఇంట్లో 7 తులాల బంగారం, కొంత నగదును దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై హరిబాబు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Similar News