శాంతి భద్రతల పట్ల అప్రమత్తంగా ఉండాలి

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులంతా శాంతి భద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ పేర్కొన్నారు.

Update: 2024-03-06 15:25 GMT

దిశ, బాన్సువాడ : కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులంతా శాంతి భద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ పోలీస్ స్టేషన్ ను ఆమె బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. అనంతరం పోలీస్ సిబ్బంది విధివిధానాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బాన్సువాడ డివిజన్ లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా

     అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను వెంటనే గుర్తించాలని బాన్సువాడ డివిజన్ పరిధిలోని సీఐలను ఆమె ఆదేశించారు. మంజీరా ప్రాంతంలో జరిగే అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపాలని పేర్కొన్నారు. అదే విధంగా రాత్రి సమయంలో పెట్రోలింగ్ పెంచాలన్నారు. కార్యక్రమంలో బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ, బాన్సువాడ రూరల్ సీఐ సత్యనారాయణ గౌడ్, పట్టణ సీఐ కృష్ణ, బిచ్కుంద సీఐ నరేష్, బీర్కూర్ ఎస్ ఐ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 


Similar News