రైతులకు బ్యాంకర్లు రుణాలు విరివిగా అందించాలి

రైతులకు బ్యాంకర్లు రుణాలు విరివిగా అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.

Update: 2023-12-22 13:38 GMT

దిశ,కామారెడ్డి : రైతులకు బ్యాంకర్లు రుణాలు విరివిగా అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో డీసీసీ, డీఎల్ఆర్పీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లాలో పాడి, మత్స్య పరిశ్రమలకు ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకొని లబ్ధిదారులకు రుణాలు అందించాలని సూచించారు. అర్హత గల రైతులకు పంట రుణాలు అందించాలని కోరారు. మున్సిపాలిటీలలో అర్హులైన వీధి వ్యాపారులకు

    లక్ష్యం మేరకు రుణాలు మంజూరు చేయాలని సూచించారు. సక్రమంగా రుణాలు చెల్లించిన స్వయం సహాయక సంఘాలకు రెట్టింపు రుణాలు ఇవ్వాలన్నారు. ఎన్పీఏ బకాయిలు వసూలు చేపట్టాలని పేర్కొన్నారు. వికసిత్ భారత్ సంకల్పయాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన పెంపొందించాలని తెలిపారు. అర్హత గల వారికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా చూడాలన్నారు. సమావేశంలో వివిధ బ్యాంకుల రుణ వితరణ, పనితీరుపై సమీక్ష జరిపారు. సమావేశంలో కెనరా బ్యాంక్ రీజినల్ హెడ్ శ్రీనివాస్, నాబార్డ్ డీడీఎం ప్రవీణ్ కుమార్, ఎల్డీఎం సుదీర్ భార్గవ్, డీఆర్డీఓ సాయన్న, ఎస్సీ కార్పొరేషన్ ఈడి దయానంద్, జిల్లా మత్స్యశాఖ అధికారి వరదారెడ్డి, ఎస్టీ సంక్షేమ అధికారి శ్రీనివాస్ రెడ్డి, అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. 


Similar News