Bandh : ఆలయాల పై దాడులు.. భిక్కనూరు పట్టణ బంద్..

హిందూ దేవాలయాల ( temples ) పై దాడులను నిరసిస్తూ హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో, బజరంగ్ దళ్ పిలుపు మేరకు సోమవారం భిక్కనూరు పట్టణ బంద్ (Bandh) విజయవంతం అయ్యింది.

Update: 2024-10-28 08:22 GMT

దిశ, భిక్కనూరు : హిందూ దేవాలయాల ( temples ) పై దాడులను నిరసిస్తూ హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో, బజరంగ్ దళ్ పిలుపు మేరకు సోమవారం భిక్కనూరు పట్టణ బంద్ (Bandh) విజయవంతం అయ్యింది. బంద్ సందర్భంగా పట్టణంలోని వాణిజ్య వ్యాపార సంస్థలతో పాటు టిఫిన్ సెంటర్లు స్వచ్ఛందంగా మూసి ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా ఎస్ఐ సాయికుమార్ నేతృత్వంలో పోలీస్ బలగాలను ప్రధాన ప్రాంతాల్లో మొహరించారు. బజరంగ్ దళ్ సభ్యులు పట్టణంలో వాహనాల పై తిరుగుతూ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలను మూసి వేయించడమే, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను ( Government and private offices ) సైతం మూసివేయించారు.

అనంతరం స్థానిక సినిమా టాకీస్ చౌరస్తాలో నిలబడి నిరసన తెలియజేశారు. దీంతో రోడ్లకిరువైపుల ఎక్కడి వాహనాలు అక్కడ నుంచి పోయి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయం పై జరిగిన దాడిని ఈ సందర్భంగా వారు తీవ్రంగా ఖండించారు. హిందూ దేవాలయాల పై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ అధ్యక్షులు అవధూత నవీన్, భరత్, సార్గు సందీప్, అరుణ్, నితిన్, అనిల్ రెడ్డి, రవి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News