transport department : సీజ్ చేసిన వాహనాలకు వేలం..

గత కొన్ని సంవత్సరాలుగా రవాణా శాఖ అధికారులు సీజ్ చేసి, పలు చోట్ల ఉంచిన వాహనాలకు నోటీసులు పంపినా వాటి ఓనర్లు, ఎవరూ కూడా సంప్రదించనందున ఆ వాహనాలకు పై అధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 29న వేలం వేయనున్నట్టు ఆర్మూర్ మోటార్ వాహన తనిఖీ అధికారి గుర్రం వివేకానంద రెడ్డి శనివారం తెలిపారు.

Update: 2024-10-27 06:02 GMT

దిశ, ఆర్మూర్ : గత కొన్ని సంవత్సరాలుగా రవాణా శాఖ అధికారులు సీజ్ చేసి, పలు చోట్ల ఉంచిన వాహనాలకు నోటీసులు పంపినా వాటి ఓనర్లు, ఎవరూ కూడా సంప్రదించనందున ఆ వాహనాలకు పై అధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 29న వేలం వేయనున్నట్టు ఆర్మూర్ మోటార్ వాహన తనిఖీ అధికారి గుర్రం వివేకానంద రెడ్డి శనివారం తెలిపారు. ఈ వాహనాల వేలంలో ఆటోలు, రోడ్డు రోలర్, మినీ గూడ్స్ వాహనాలు, గూడ్సు వాహనాలు, బొలెరోలు, స్కూలు బస్సులు, మోటార్ సైకిల్ తదితర వాహనాలు ఆర్మూర్ బస్ స్టాండ్ లో, నందిపేట్, మోర్తాడ్, ముప్కాల్, బాల్కొండ పోలీస్ స్టేషన్లు, వివిధ పోలీస్ స్టేషన్లో ఉన్న వాహనాలకు ఈ నెల 29న "యాస్ ఇస్ వేర్ ఇస్" ఎక్కడ ఉన్నవి అక్కడ పద్ధతిలో వేలం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆసక్తి కలవారు ధరావతు చెల్లించి ఈ వేలం పాటలో పాల్గొనవలసిందిగా సూచించారు. వేలంపాట ఆర్మూర్ వాహన తనిఖీ అధికారి కార్యాలయం ఎంజే కాలనీ యూనిట్ ఆఫీస్ లో మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహిస్తారని ఆర్మూర్ మోటార్ వాహన తనిఖీ అధికారి గుర్రం వివేకానంద రెడ్డి చెప్పారు. ఆసక్తి గలవారు వేలంపాటలో పాల్గొనాలని ఆయన కోరారు.


Similar News