స్వీయ మూల్యాంకనంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బెస్ట్..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యను సులభంగా స్వీయ మూల్యాంకనం చేసుకోవడానికి ఉపయోగపడే కార్యక్రమాన్ని అధికారులు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు పరిచయం చేస్తున్నారు.

Update: 2025-03-15 13:24 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యను సులభంగా స్వీయ మూల్యాంకనం చేసుకోవడానికి ఉపయోగపడే కార్యక్రమాన్ని అధికారులు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు పరిచయం చేస్తున్నారు. సిరికొండ మండలం రావుట్లలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం ఈ తరహా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి పి.రాములు మాట్లాడుతూ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా వారే సొంతంగా మూల్యాంకనం చేసుకునే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు.

దీనిని సక్రమంగా విద్యార్థులకు అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పై ఉందన్నారు. రెండు నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. భవిష్యత్తులో దీని ప్రాధాన్యత అధికంగా ఉంటుందని, విద్యార్థులు స్వీయ మూల్యాంకనం ద్వారా జ్ఞానాన్ని పొందడమే కాకుండా సంతోషంగా నేర్చుకుంటారని ఎంఈఓ రాములు అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠాశాల ప్రధానోపాధ్యాయుడు సీహెచ్. శ్రీనివాస్, కాంప్లెక్స్ హెచ్.ఎం.రాజేశ్వర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుని విజేత, ఉపాధ్యాయులు ఎం.బాలయ్య, దయాల్ సింగ్, ఉమాశేఖర్, వీణ, శివాని, నవిత విద్యార్థులు, పేరెంట్స్ పాల్గొన్నారు.


Similar News