మైనర్ బాలిక ఆత్మహత్య కేసులో నిందితుడు రిమాండ్

లింగంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక ఆత్మహత్యకు కారణమైన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు.

Update: 2024-03-07 12:15 GMT

దిశ, లింగంపేట్ : లింగంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక ఆత్మహత్యకు కారణమైన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా నిందితుడు కొడబోయిన అశోక్ మైనర్ బాలికతో ప్రేమాయణం సాగించినట్లు తెలిపారు. అశోక్ కారణంగా గర్భం దాల్చిన మైనర్ బాలిక తనను వివాహం చేసుకోవాలని కోరగా నిందితుడు నిరాకరించడంతో మనస్థాపం చెందిన బాలిక రెండు రోజుల క్రితం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దాంతో నిందితుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. 


Similar News