ఆ ఆలయ పునర్నిర్మాణానికి 11 లక్షల విరాళం..
కామారెడ్డి జిల్లా రామరెడ్డి మండలంలోని మద్దికుంట శ్రీ స్వయం భూ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి తనవంతుగా 11 లక్షల పదకొండు వేల నూట పద కొండు రూపాయలను మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు విరాళంగా ప్రకటించారు.
దిశ, మాచారెడ్డి : కామారెడ్డి జిల్లా రామరెడ్డి మండలంలోని మద్దికుంట శ్రీ స్వయం భూ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి తనవంతుగా 11 లక్షల పదకొండు వేల నూట పద కొండు రూపాయలను మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు విరాళంగా ప్రకటించారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం మాచారెడ్డి మండల ఎంపీపీ లోయపల్లి అనితా నర్సింగరావు దంపతులు భూ బుగ్గ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి తో పాటు ఆలయ పూజారులు ఎంపీపీని పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారి కల్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ఎంపీపీ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకం జరిపించారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించారు. శివుని కృపాకటాక్షం భక్తులందరికీ ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తూ అమ్మవారికి ఆరు తులాల బంగారు నెక్ల్స్ స్ సమర్పించారు. మహా శివరాత్రి వేడుకలో భాగంగా రామరెడ్డి మండలం అన్నారం గ్రామంలోని నూతనంగా నిర్మాణమవుతున్న శివాలయనికి రెండు లక్షల యభై వేల రూపాయలు, మాచారెడ్డి మండలం బండ రామేశ్వర పల్లి గ్రామంలోని రాజరాజేశ్వరాలయ అభివృద్ధికి, కల్యాణ మండప నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.