Niranjan Reddy : పాలమూరును మళ్ళీ వలసల జిల్లాగా మార్చవద్దు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
పాలమూరు వలసల(Migrations)పై బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : పాలమూరు వలసల(Migrations)పై బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల కోసం గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం భూములు సేకరించిందని, వాటిని వాడుకుంటే సరిపోతుందని.. ఇపుడు కొత్తగా భూములు సేకరించాల్సిన పని లేదని తెలియజేశారు. గత ప్రభుత్వ చర్యల వలన పాలమూరు జిల్లా పచ్చగా మారిందని.. దానిని మళ్ళీ వలసల జిల్లాగా మార్చవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు(Rythubandhu) ఎగవేయడానికి రైతు బోనస్ పేరిట అబడ్డలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో ఎన్కౌంటర్లు లేవు.. రేవంత్ రెడ్డి.. అమిత్ షాతో కలిసి రాష్ట్రంలో ఎన్కౌంటర్లకు తెరలేపారని అన్నారు.