ACP ఉమామహేశ్వరరావు కేసులో కొత్త ట్విస్ట్
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నిన్న రాత్రి అరెస్ట్ అయిన సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావు కేసులో మరో ట్విస్ట్ చేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నిన్న రాత్రి అరెస్ట్ అయిన సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావు కేసులో మరో ట్విస్ట్ చేసుకుంది. కొందరు పోలీసు అధికారులతో కలిసి బినామీ వ్యాపారాలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఉమామహేశ్వరరావు ల్యాప్‌టాప్‌లో అవినీతి చిట్టాను ఏసీబీ గుర్తించింది. ఆర్థిక వ్యవహారాలను ల్యాప్ టాప్‌లో ఉమామహేశ్వరరావు పొందుపర్చినట్లు తెలుస్తోంది. ల్యాప్ టాప్‌లో దొరికిన సమాచారం ఆధారంగా ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. తనపై ఫిర్యాదు చేసిన వారిపైనే ఉమామహేశ్వరరావు బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది.