ఎస్ఎస్సీ ఫలితాలలో 'న్యూ రిషి' విద్యార్థుల ప్రభంజనం

జిల్లా కేంద్రంలోని న్యూ రిషి హైస్కూల్ విద్యార్థులు బుధవారం విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రభంజనం సృష్టించారు.

Update: 2023-05-10 12:22 GMT

దిశ, మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలోని న్యూ రిషి హైస్కూల్ విద్యార్థులు బుధవారం విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రభంజనం సృష్టించారు. పాఠశాలను స్థాపించినప్పటి నుంచి రికార్డు స్థాయిలో ఫలితాలను సాధిస్తున్న న్యూ రిషి హైస్కూల్ విద్యార్థులు ఈ ఏడాది ఎస్ఎస్సీ ఫలితాలలోను తమ సత్తా చాటారు. పాఠశాలకు చెందిన పదిమంది విద్యార్థులు 10 గ్రేడ్ పాయింట్లు సాధించగా, ఏడు మంది విద్యార్థులు 9.8 గ్రేడ్ పాయింట్లు సాధించారు.

11 మంది విద్యార్థులు 9.7, గ్రేట్ పాయింట్లు సాధించగా 71 మంది విద్యార్థులు 9 గ్రేడ్ పాయింట్లను సాధించారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల చైర్మన్ చంద్రకళ వెంకట్, కరస్పాండెంట్ పూజిత మోహన్ రెడ్డి, కోశాధికారి శిరీష ప్రవీణ్, డైరెక్టర్ సుశాంత కృష్ణ తదితరులు అభినందించారు. రానున్న రోజులలో మరింత శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు విద్యార్థులకు సూచించారు. తమ పిల్లలు అత్యుత్తమ ఫలితాలు సాధించడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

Also Read...

ఆత్మహత్యలు చేసుకోకుండా తల్లిదండ్రులు మనోధైర్యం ఇవ్వాలి: సబితా ఇంద్రారెడ్డి 

Tags:    

Similar News