సిటీలో కొత్త పోలీస్జోన్లు.. రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్పోలీస్కమిషనరేట్పరిధిలో కొత్తగా రెండు డీసీపీ జోన్లతోపాటు తొమ్మిది ఏసీపీ సబ్డివిజన్లు, పది లా అండ్ఆర్డర్పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేస్తూ సోమవారం హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: హైదరాబాద్పోలీస్కమిషనరేట్పరిధిలో కొత్తగా రెండు డీసీపీ జోన్లతోపాటు తొమ్మిది ఏసీపీ సబ్డివిజన్లు, పది లా అండ్ఆర్డర్పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేస్తూ సోమవారం హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర మండలం మినహా మిగిలిన అన్ని జోన్లలో మహిళా పోలీస్స్టేషన్లు కూడా కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. ఇవి ఉమెన్స్సేఫ్టీ వింగ్పరిధిలోకి వస్తాయని తెలిపింది. ఇప్పటిదాకా హైదరాబాద్కమిషనరేట్పరిధిలో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్జోన్లు ఉండగా.. కొత్తగా సౌత్ఈస్ట్, సౌత్వెస్ట్జోన్ల చేరతాయి. ఏసీపీ సబ్డివిజన్ల పరిధిలోకి వస్తే గాంధీనగర్సబ్డివిజన్(దోమలగూడ, లేక్పోలీస్స్టేషన్లు), చిలకలగూడ సబ్‌డివిజన్(వారాసిగూడ పోలీస్‌స్టేషన్), ఉస్మానియా ఏసీపీ సబ్‌డివిజన్, బేగంపేట ఏసీపీ సబ్ డివిజన్(తాడ్బన్పోలీస్స్టేషన్) తిరుమలగిరి ఏసీపీ సబ్‌డివిజన్,సైదాబాద్, గోల్కొండ ఏసీపీ సబ్డివిజన్లు కూడా ప్రారంభిస్తారు.
కొత్త కుల్సుంపురా ఏసీపీ సబ్‌డివిజన్(కొత్తగా గుడిమల్కాపూర్స్టేషన్), ఛత్రినాక ఏసీపీ సబ్‌డివిజన్‌ను కూడా ప్రారంభించనుండగా.. మాసాబ్ట్యాంక్స్టేషన్ బంజారాహిల్స్ఏసీపీ డివిజన్లో ఉంటుంది. జూబ్లీహిల్స్ఏసీపీ సబ్ డివిజన్ (కొత్తగా ఫిలింనగర్స్టేషన్) రానుంది. సంజీవరెడ్డినగర్ఏసీపీ డివిజన్‌కూడా కొత్తగా రానుండగా(కొత్తగా బోరబండ స్టేషన్)వస్తుందని వివరించింది. కొత్తగా రహమత్నగర్స్టేషన్ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. నూతనంగా ఉమెన్స్సేఫ్టీ వింగ్ప్రారంభం కానుందని, దీని పరిధిలోకి సెంట్రల్, ఈస్ట్, వెస్ట్, సౌత్, సౌత్వెస్ట్జోన్లలో కొత్తగా ఏర్పాటయ్యే మహిళా పోలీస్స్టేషన్లు వస్తాయని పేర్కొంది.