నెట్, టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ క్లాష్.. తేదీలు మార్చాలని అభ్యర్థుల డిమాండ్

నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్), టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) షెడ్యూల్ క్లాష్ అయింది.

Update: 2024-12-03 02:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్), టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) షెడ్యూల్ క్లాష్ అయింది. ఈ రెండు పరీక్షల షెడ్యూల్ ఒకే సమయంలో ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌నకు అర్హత సాధించేందుకు, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం ఎన్టీఏ నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్(నెట్)ను నిర్వహించనుంది. కాగా రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) నిర్వహించనున్నారు. అయితే ఈ రెండు పరీక్షల షెడ్యూల్ వచ్చే ఏడాది జనవరి 1 నుంచి మొదలవుతోంది.

నెట్ పరీక్ష షెడ్యూల్ జనవరి 1 నుంచి 19వ తేదీ వరకు ఉండగా టెట్ షెడ్యూల్ వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రెండు పరీక్షలు ఒకే షెడ్యూల్ సమయంలో ఉండటంతో అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశముంది. టెట్ పరీక్షల షెడ్యూల్‌ను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ రెండు పేపర్లకు మొత్తం 2,75,773 దరఖాస్తులు వచ్చాయి. పేపర్ వన్‌కు 94,335 వేల అప్లికేషన్లు, పేపర్ 2కు 1,81,438 అప్లికేషన్లు వచ్చాయి. లక్షలాది మంది అభ్యర్థులకు న్యాయం జరగాలంటే టెట్ షెడ్యూల్‌ను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News