నీట్ ఎగ్జామ్ స్టార్ట్.. 70 వేల మంది హాజరు
వైద్య,విద్య ప్రవేశాల కొరకు నిర్వహించే నీట్ ఎగ్జామ్ ఆదివారం షురూ అయింది.
దిశ,తెలంగాణ బ్యూరో: వైద్య,విద్య ప్రవేశాల కొరకు నిర్వహించే నీట్ ఎగ్జామ్ ఆదివారం షురూ అయింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను మానిటరింగ్ చేస్తున్నది. రాష్ట్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్,సంగారెడ్డి, మహబూబ్‌నగర్, హయత్‌నగర్, ఆదిలాబాద్, భూపాలపల్లి, గద్వాల, జగిత్యాల, జనగాం, కొత్త గూడెం, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట్ ప్రాంతాలలో 115 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు జరిగే పరీక్షకు ఉదయం 11 గంటల తర్వాత హాల్‌లోకి అనుమతించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాలలో దాదాపు 70 వేల మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రతి పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. సలహాలు సూచనలను మైక్‌ల ద్వారా తెలియజేశారు. ఎన్‌టిఏ నిబంధన ప్రకారం ఒకటిన్నర తర్వాత ఎవరినీ అనుమతించలేదని ఎగ్జామ్స్ సెంటర్ల నిర్వాహకులు తెలిపారు. ఎగ్జామ్ కేంద్రాల్లోకి జియోమెట్రీ, పెన్సిల్ బాక్స్, ప్లాస్టిక్ పౌచ్, క్యాలిక్యులేటర్, పెన్, స్కేల్, రైటింగ్ ప్యాడ్, పెన్ డ్రైవ్, ఏరేజర్, లాగ్ టేబుల్, ఎలక్ట్రానిక్ పేన్‌స్కానర్‌తో పాటు మొబైల్ ఫోన్, బ్లూటూత్, ఇయర్‌ఫోన్స్, మైక్రోఫోన్, పేజర్, హెల్త్ బ్యాండ్, బెల్ట్స్, హ్యాండ్ బ్యాగ్, గగూల్స్, క్యాప్స్‌తో పాటు వాచ్, బ్రాస్‌లెట్, బంగారు అభరణాలు, ఫుడ్ ఐటెమ్స్, వాటర్ బాటిల్స్ వంటి వేవీ అనుమతించలేదు.