లోకో పైలట్ అప్రమత్తత.. తప్పిన రైలు ప్రమాదం (వీడియో)

నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించటంతో ఎలాంటి నష్టం జరుగలేదు.

Update: 2023-02-26 11:04 GMT

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించటంతో ఎలాంటి నష్టం జరుగలేదు. అహ్మదాబాద్-చెన్నై మధ్య నడిచే నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలు ఆదివారం మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే బోగీల కింది నుంచి దట్టమైన పొగలు వ్యాపించాయి.

గమనించిన లోకో పైలట్ వెంటనే స్టేషన్లో రైలు ఆపి వేసాడు. అయితే, ఏం జరిగిందో అర్థం కాక ప్రయాణికులు రైలు దిగి పరుగులు పెట్టారు. బ్రేక్ లైనర్లు బిగుసుకు పోవటం వల్లనే పొగలు వచ్చాయని, ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే, నవజీవన్ రైలును ఆపటం వల్ల ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

Full View


Tags:    

Similar News