అడ్వకేట్ నాగరాజు సమక్షంలో నందకుమార్‌ను విచారించిన పోలీసులు
టీఆర్ఎస్ ఎమ్మె్ల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నందకుమార్‌పై బంజారాహిల్స్ పీఎస్‌లో నమోదైన కేసు విచారణలో భాగంగా మొదటి రోజు కస్టడీ విచారణ ముగిసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: టీఆర్ఎస్ ఎమ్మె్ల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నందకుమార్‌పై బంజారాహిల్స్ పీఎస్‌లో నమోదైన కేసు విచారణలో భాగంగా మొదటి రోజు కస్టడీ విచారణ ముగిసింది. అడ్వకేట్ నాగరాజు సమక్షంలో ఇవాళ నందకుమార్‌ను పోలీసుల విచారించారు. మొదటి రోజు ఐదున్నర గంటల పాటు విచారించిన పోలీసులు.. డెక్కన్ కిచెన్ హోటల్ వ్యవహారంపై ఆరా తీసినట్లు తెలుస్తుంది. ఆర్ధిక లావాదేవీలు, లీజ్ అగ్రిమెంట్ విషయంపై పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఇదే కేసు విచారణలో రేపు మరోసారి నందకుమార్‌ను పోలీసులు విచారించనున్నారు. అయితే, ఇప్పటికే ఎమ్మె్ల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ పై బంజారాహిల్స్ పీఎస్‌లో మూడు చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నందకుమార్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరగా నాంపల్లి కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది.