చంచల్‌గూడ జైలునుంచి విడుదలైన నందకుమార్

బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసులో కీలక నిందితుడిగా ఉన్న నందకుమార్ శుక్రవారం ఉదయం చంచల్‌గూడ జైలునుంచి విడుదల అయ్యారు.

Update: 2023-01-13 04:13 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు నందకుమార్‌కు బెయిల్‌ లభించింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న నందకుమార్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో నందకుమార్ శుక్రవారం నాడు చంచల్‌గూడ జైలు నుండి విడుదలయ్యాడు. హైదరాబాద్‌ విడిచి వెళ్లరాదంటూ కోర్టు ఆదేశించింది. రూ. 10 వేల చొప్పున రెండు పూచీకత్తులను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు రూ. 10 వేల పూచీకత్తుతో పాటు రెండు షూరిటీలు నందకుమార్‌ సమర్పించారు. దీంతో, బెయిల్‌ లభించగా.. నిందితుడు నందకుమార్‌ చంచల్‌గూడ జైలు నుండి విడుదలయ్యారు. కాగా, ఈ కేసులో గతంలోనే నందకుమార్, రామచంద్రభారతి, సింహాయాజీలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ, బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన మరో కేసులో నందకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసులో కూడా నందకుమార్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యాడు.

Tags:    

Similar News