రైతులు పండించిన ప్రతి గింజను కొంటాం.. ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని దేవరకొండ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు.
దిశ, దేవరకొండ: బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని దేవరకొండ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం డిండి మండలం చెరుకుపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఎవరూ కూడా అధైర్యపడవద్దని ఆయన తెలిపారు. రైతుల పాలిట సీఎం కేసీఆర్ దేవుడని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంస్కరణలు, పథకాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారిందని ఆయన అన్నారు. సాగునీటిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ కనబరచడంతో రాష్ట్రంలో అన్యోన్యంగా పంట దిగుబడి పెరిగిందని ఆయన పేర్కొన్నారు. దళారుల బెదడను అరికట్టేందుకు ప్రభుత్వం పెద్ద సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కష్టాల గుర్తించి అధిక సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దళారుల భారీ నుండి ఆదుకుంటున్నారని ఆయన తెలిపారు.
ప్రభుత్వం గిట్టుబాటు ధర 2060 అందిస్తుందని, ఎండబెట్టిన నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు అధ్యక్షులు రాజనేని వెంకటేశ్వరరావు, పిఎసిఎస్ చైర్మన్ తుం నాగార్జున రెడ్డి, వైస్ ఎంపీపీ గోరేటి పుల్లమ్మ, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జంగారెడ్డి, సర్పంచ్ ఏమిరెడ్డి వెంకటరెడ్డి, మల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, భగవంతు రావు, బొడ్డుపల్లి జయంత్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.