ఇదేందయ్య ఇది..పెట్రోల్ కొట్టించిన వ్యక్తి..బంక్ దాటగానే మైండ్ బ్లాంక్
దీక్ష ఫ్యూయల్ స్టేషన్ లో డీజిల్ కు బదులు నీళ్లు రావడంతో..వాహనదారులు పెట్రోల్ బంక్ ముందు ఘర్షణకు దిగిన సంఘటన శుక్రవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
దిశ, చివ్వేంల: దీక్ష ఫ్యూయల్ స్టేషన్ లో డీజిల్ కు బదులు నీళ్లు రావడంతో..వాహనదారులు పెట్రోల్ బంక్ ముందు ఘర్షణకు దిగిన సంఘటన శుక్రవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..ఖమ్మంకు చెందిన వాహనదారుడు ఎండి అక్రమ్ దీక్ష ఫ్యూయల్ స్టేషన్లో తన కారులో 1500 రూపాయల డిజిల్ ని కొట్టించుకొని కొద్ది దూరం వెళ్ళాక కారు ఆగిపోయింది. దీంతో అనుమానం వచ్చి మెకానిక్ ని సంప్రదించగా డీజిల్ కు బదులు నీరు ఉందని తెలిపారు. కారుని ఖమ్మం మెకానిక్ షెడ్ కి తీసుకెళ్లగా.. వాహనదారుడు కి సుమారు 25000 నుంచి 30000 ఖర్చు అయినట్టు బాధితుడు ఆరోపించారు. వాహనదారుడు తిరిగి వచ్చి బంకు యజమాని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్తూ ఉండడంతో.. వాహనదారుడు ఘర్షణకు దిగారు. దీంతో పెట్రోల్ బంక్ యజమాని వారికి సర్దిచెప్పి వాహన ఖర్చులు ఇస్తానని హామీ ఇచ్చాడు. స్థానికులు, వాహనదారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ బంకు లో తరచూ ఇదే గొడవలు జరుగుతున్నాయని ,బంకులు పెట్రోల్ ,డీజిల్ కొట్టించిన వాహనదారులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి బంకుపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.