లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో చోరీ

మాడుగులపల్లి మండలంలోని పెద్దదేవులపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో చోరీ జరిగింది.

Update: 2024-12-29 16:55 GMT

దిశ,మాడుగులపల్లి; మాడుగులపల్లి మండలంలోని పెద్దదేవులపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో చోరీ జరిగింది. మాడుగులపల్లి ఎస్సై ఎస్ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం..మాడుగులపల్లి మండలంలోని పెద్దదేవులపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శనివారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు గుడి తాళాలు పగలగొట్టి, నాలుగు జతల బంగారు పుస్తెలు, వెండి మెట్టెలు ఐదు తులాలు, మైకు అంప్లి ప్లేయర్, 3000 నగదు చోరీ జరిగినట్టు ఎస్సై తెలిపారు. ఆలయ పూజారి తిరుమల జగన్ మోహన చార్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. నల్గొండ నుంచి క్లూస్ టీం వారు దొంగతనం జరిగిన ప్రదర్శన సందర్శించారు.


Similar News