నాగార్జున సాగ‌ర్‌ జలాశయం దగ్గర 'నీటి ‌కు‌క్కల' సందడి

నల్గొండ జిల్లాలోని నాగార్జున‌ సాగ‌ర్‌ జలాశయంలో అరుదుగా కనిపించే నీటి‌ కు‌క్కలు దర్శనం ఇచ్చాయి.

Update: 2024-09-21 09:46 GMT

దిశ, నాగార్జున సాగ‌ర్: నల్గొండ జిల్లాలోని నాగార్జున‌ సాగ‌ర్‌ జలాశయంలో అరుదుగా కనిపించే నీటి‌ కు‌క్కలు దర్శనం ఇచ్చాయి. జలాశయంలో కలియతిరుగుతూ నీటి కుక్కలు వీక్షకులకు కనువిందు చేస్తున్నాయి. అటు భూమి మీద ఇటు నీటిలో ఉండగలిగే ఉభయ చరాల్లో నీటికుక్కలు కూడా ఒకటి. శనివారం నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ లో ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు వంతెన సమీపంలో ఆంజనేయస్వామి పుష్కర ఘాట్ వద్ద నీటి కుక్కలు దర్శనమిచ్చాయి. కనుమరుగైపోతున్న జాతుల్లో నీటి కుక్కలు కూడా ఒకటి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నీటికుక్కల ఉనికిని అటవీశాఖ అధికారులు గుర్తించారు. చేపలను ఆహారంగా తీసుకుని నీటికుక్కలు జీవనం సాగిస్తుంటాయి.

రెండేళ్ల క్రితం ఒకసారి సాగర్ జలాల్లో నీటి కుక్కలు గుర్తించారు. అయితే ఆ తర్వాత కాలంలో అవి కనిపించకుండా పోయాయి. తాజాగా సాగర్ జలాల్లో గతంలో కంటే ఎక్కువ సంఖ్యలోనే నీటి కుక్కలు జీవనం సాగిస్తున్నట్లు గుర్తించారు. అంతరించి పోతున్న అరుదైన జాతి కావటంతో వీటిని సంరక్షించాలని పర్యాటకులు, జంతు ప్రేమికులు కోరుతున్నారు. చూసేందుకు ముంగిస లాంటి తల, మెడ చూస్తే సీల్ చేప గుర్తొస్తుంది. ఇదో రకమైన క్షీరదం. దీనికి శాస్త్రీయ నామం అట్టర్. పెద్దగా అలికిడి లేని నీటి వనరుల ఉన్న ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఇవీ సరిసృపాలు.. నీటితో పాటు నేలపైనా ఉండగలవు. నీటి కుక్కలు కనిపించడంతో సందర్శకులు పెద్ద ఎత్తున ఫొటోలు, వీడియోల్లో వాటిని బంధించారు


Similar News