ఎట్టకేలకు ప్రారంభమైన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం..

చాలా కాలం తర్వాత నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలోని శాసనసభ్యుని నివాస, క్యాంపు కార్యాలయం శనివారం ప్రారంభానికి నోచుకుంది.

Update: 2025-03-15 16:04 GMT

దిశ, తుంగతుర్తి : చాలా కాలం తర్వాత నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలోని శాసనసభ్యుని నివాస, క్యాంపు కార్యాలయం శనివారం ప్రారంభానికి నోచుకుంది. రూ.కోటి వ్యయంతో 2018 జూలై 11న అప్పటి ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండాలనే సంకల్పంతో శాసనసభ్యుల నివాస, క్యాంపు కార్యాలయాన్ని మంజూరు చేయగా అప్పటి శాసనసభ్యులు (ప్రస్తుతం మాజీ) డాక్టర్ గాదరి కిషోర్ కుమార్, అప్పటి జడ్పీ చైర్ పర్సన్, (ప్రస్తుత మాజీ) గుజ్జ దీపిక యుగేందర్ రావులు శంకుస్థాపన చేశారు.

అనంతరం భవన నిర్మాణంలో జాప్యం ఏర్పడింది. చివరికి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలకు కొద్ది రోజుల ఎన్నికల నోటిఫికేషన్ పడుతుందనే ఉద్దేశంతో ప్రారంభమైంది. కాగా నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ క్యాంపు కార్యాలయంలోకి రావడానికి పలు కారణాలు చెబుతూ వెనకడుగు వేశారు. తర్వాత ఎమ్మెల్యే సామేల్ సూచించిన విధంగా మరిన్ని సౌకర్యాలు ఏర్పాటయ్యాయి. చివరికి శనివారం కార్యాలయాన్ని ఎమ్మెల్యే సామేల్, రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్నతో కలిసి తన కార్యాలయాన్ని ప్రారంభించారు.

Read More..

ప్రభుత్వ బడుల్లో ఏఐ పాఠాలు 


Similar News