ఒకరి పేరుతో లేఖ.. మరొకరి సంతకంతో ఉత్తర్వులు!

జిల్లాలో ఓ ప్రధాన శాఖకు సంబంధించిన అధికారి సుమారు గత వారం రోజులుగా సెలవులో ఉన్నారని సమాచారం.

Update: 2025-03-16 10:27 GMT

దిశ, నల్లగొండ బ్యూరో: జిల్లాలో ఓ ప్రధాన శాఖకు సంబంధించిన అధికారి సుమారు గత వారం రోజులుగా సెలవులో ఉన్నారని సమాచారం. ఆ అధికారి బదులు మరో అధికారిని ఇన్చార్జిగా కూడా నియమించారు. కానీ విచిత్రం ఏమిటంటే సెలవులో ఉన్న అధికారి పేరును మార్చి 15వ తేదీని కోడ్ చేస్తూ ఉత్తర్వులు వెలుపడ్డాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. దాదాపు వారం రోజులుగా డిఆర్డిఏ పిడి శేఖర్ రెడ్డి సెలవులో ఉన్నారు. 17న విధుల్లో చేరే అవకాశం ఉందని సమాచారం. ఆయన స్థానంలో మరొక అధికారిని ఇన్చార్జ్ అధికారిగా కూడా నియమించారు. పర్యవేక్షణ అంతా ఆ అధికారి చేస్తున్నారు ఇప్పుడు. కానీ మార్చి 15న మత్స్యశాఖ నుంచి అందించే సబ్సిడీ పథకానికి ఓ మహిళ పేరు ప్రతిపాదన చేస్తూ.. సెలవుల్లో ఉన్న అధికారి పేరు తో ఉత్తర్వులు వెలువడడం ఆశ్చర్యంగా ఉంది. కానీ ప్రతిపాదన లేఖ కింద సంతకం మాత్రం ఇంచార్జ్ అధికారి సంతకం చేశారని తెలుస్తోంది. అంటే లేఖ ఒకరి పేరుతో ఉండగా..ఆ లేఖపై సంతకం ఇన్చార్జి అధికారి పేరు ఉండడం గమనార్హం.


Similar News