జాతీయ ఎస్సీ, ఎస్టీ కుల సంఘాల సినియర్ ఉపాధ్యక్షులుగా సూర్యం నాయక్

పెన్ పహాడ్ మండల పరిధిలోని చిన్న గారకుంట తాండ గ్రామానికి చెందిన దారావత్ సూర్యం నాయక్ జాతీయ స్థాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీ ,ఎస్టీ కుల సంఘాల ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ సీనియర్ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు.

Update: 2024-10-02 14:59 GMT

దిశ, పెన్ పహాడ్ : మండల పరిధిలోని చిన్న గారకుంట తాండ గ్రామానికి చెందిన దారావత్ సూర్యం నాయక్ జాతీయ స్థాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీ ,ఎస్టీ కుల సంఘాల ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ సీనియర్ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల పట్ల కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు మామిడి వెంకన్న గౌడ్ హర్షం వ్యక్తం చేస్తూ పూల గుచ్చానందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే (S B I )స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్న సూర్యం నాయక్ జాతీయ స్థాయిలో సీనియర్ ఉపాధ్యక్షులుగా ఎన్నికల కావడంతో.. తన స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సూర్యం నాయక్ మాట్లాడుతూ.. ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ సమస్యలపై నిరంతరం ముందుండి ఉద్యమిస్తానని తెలిపారు. అభినందనలు తెలిపిన వారిలో మిర్యాలగూడ మాజీ జెడ్పిటిసి దోసపాటి శ్రీనివాస్, బొల్లికొండ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు


Similar News