మహాత్మా గాంధీ విగ్రహానికి వెండి కిరీటం

మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గం ఎంతో ఆచరణీయమని హింసతో కాకుండా అహింసతో దేనినైనా సాధించవచ్చునని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

Update: 2024-10-02 15:12 GMT

దిశ, చిట్యాల : మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గం ఎంతో ఆచరణీయమని హింసతో కాకుండా అహింసతో దేనినైనా సాధించవచ్చునని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా..చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలోని జాతీయ రహదారి 65పై ఉన్న గాంధీ గుడిలో నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు బహుకరించిన వెండి కిరీటాన్ని గాంధీ విగ్రహానికి ఆయన సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి దేశ ప్రజలకు స్వాతంత్రాన్ని తీసుకువచ్చిన మహనీయుడు గాంధీ అన్నారు. గాంధీజీ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడిచి ఆయన సూచించిన మార్గాన్ని అనుసరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మహాత్మ చారిటబుల్ ట్రస్ట్ చీఫ్ డాక్టర్ సీత, జోగినపల్లి శ్రీనివాసరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


Similar News