బీజేపీ మతోన్మాదాన్ని, ప్రజావ్యతిరేక విధానాన్ని తిప్పికొడదాం !
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న మతోన్మాద ప్రజావ్యతిరేక విధానాన్ని తిప్పికొట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నరసింహారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
దిశ, దేవరకొండ : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న మతోన్మాద ప్రజావ్యతిరేక విధానాన్ని తిప్పికొట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నరసింహారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం ఏడవ రోజు సీపీఐ పాదయాత్రలో భాగంగా దేవరకొండ మండలంలోని ఇంటింటికి సీపీఐ పోరు యాత్రలో జరుపుల తండా, కమలాపూర్, ముదిగొండ, సూర్య తండా, మిషన్ కాంపౌండ్, కొండబివనపల్లి, గిర్జానగర్ తండా, దాడి తండా, గోన ధర్మ తండా, సఫావట్ తండా, తూర్పుపల్లి, గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పునర్విభజన చట్టం ప్రకారం 2014 లో వెనుకబడిన తెలంగాణకు అనేక హామీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి, హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలుపరచని బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని ఆయన అన్నారు.
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో వివిధ రంగాల్లో జరుగుతున్న అన్యాయాలను, దేశ సమైక్యత సమగ్రతకు లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రభుత్వ రంగ సంస్థలు విద్వాంసానికి పాల్పడుతూ, దేశ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక తెలంగాణ పై వివక్షత చూపుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహారెడ్డి, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామావత్ అంజయ్య నాయక్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి మైనోద్దీన్, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎస్ కనకాచారి, నూనె రామస్వామి, దేపా సుదర్శన్ రెడ్డి, బొల్లి శైలేష్, పి యాదయ్య, మద్ది వెంకటయ్య, నూనె వెంకటేశ్వర్లు, సర్పంచ్ కిన్నెర యాదయ్య , జూలూరు వెంకట్ రాములు, ఏ మల్లయ్య, మాధవరెడ్డి, వి గణేష్, రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.