ఇసుక లారీ పట్టివేత
చింతలపాలెం మండల కేంద్రంలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు.
దిశ చింతలపాలెం: చింతలపాలెం మండల కేంద్రంలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై అంతిరెడ్డి తెలిపిన సమాచారం ప్రకారం..అనుమతులు లేకుండా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఓ లారీ ను శనివారం పోలీసులు పట్టుకున్నారు. కోదాడ నుంచి చింతలపాలెంకు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీని మండలం కేంద్రం లో ఆదివారం ఉదయం పట్టుకున్నారు. సరైన అనుమతులు లేకపోవడంతో వాహనాన్ని సీజ్ చేసి డ్రైవర్ ఉపేందర్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అంతిరెడ్డి తెలిపారు. ఇసుకను అక్రమంగా తరలిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని, వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని ఎస్సై అన్నారు.