కోదాడలో దొంగల బీభత్సం...
కోదాడ పట్టణంలో దొంగల బీభత్సం కొనసాగుతుంది. తాళం వేసిన ఇళ్లే టార్గెట్ చేస్తున్న దొంగలు.
దిశ,కోదాడ : కోదాడ పట్టణంలో దొంగల బీభత్సం కొనసాగుతుంది. తాళం వేసిన ఇళ్లే టార్గెట్ చేస్తున్న దొంగలు. పోలీసులు హెచ్చరిస్తున్న పట్టించుకోని ఇంటి యజమానులు. పండుగలకు ఊరు వెళ్లేటప్పుడు ఇంటి పక్కన వారికి సమాచారం ఇచ్చి వెళ్లాలని చెబుతున్న పట్టించుకోకపోవడంతో దొంగతనం సంఘటనలు జరుగుతున్నాయి. పట్టణంలోని ఆజాద్ నగర్ లో నివాసం ఉంటున్న గోకిరే మోహన్ తన కుటుంబ సభ్యులతో తన తల్లి ఊరు అయినా హుజూర్నగర్ గ్రామం వెళ్లారు. దీంతో ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి ఇంట్లో చొరబడి బీరువా లో ఉన్న తులం బంగారం, 10 తులాల వెండిని అపహరించినట్లు మోహన్ తెలిపారు. వీటి విలువ సుమారు లక్ష 50 వేల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. మంగళవారం ఉదయం తన తమ్ముడైన నర్సి ఇంటికి వచ్చి చూడగా తలుపులు పగలగొట్టి ఉన్నాయి. దీంతో నర్సి వాళ్ళ అన్నకు సమాచారం అందించారు. దీంతో పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్లూస్ టీం వచ్చి వేలిముద్రలు పరిశీలించారు. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ రాము తెలిపారు.