అంగన్వాడి భవనం మంజూరు చేయాలని తీన్మార్ మల్లన్నకు వినతి..
మండలంలోని చల్లూరు గ్రామంలో అంగన్వాడి భవనం మంజూరు
దిశ,రాజపేట: మండలంలోని చల్లూరు గ్రామంలో అంగన్వాడి భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కు ఆదివారం గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా చల్లూరు గ్రామంలో ,రెండు అంగన్వాడీ సెంటర్లు ప్రవేటు భవనాల్లో కిరాయికి నిర్వహిస్తున్నారు. పిల్లలకు గ్రౌండ్ లేక బాత్రూమ్ లేక ఇబ్బంది పడుతున్నారు. రెండు సెంటర్లకు గాను ఒక సెంటర్ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇస్తానని మాట ఇవ్వడంతో రెండవ సెంటర్ తీన్మార్ మల్లన్న నిధులలో మొదటగా ఒక భవనం ఇస్తానని మాట ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో ఓబీసీ సెల్ రాజంపేట మండల అధ్యక్షుడు బొంత సుధాకర్, గంగు భవనంద్ రెడ్డి ,గడమల యాదేందర్ ,మీస కరుణాకర్ ,నంగునూరు నరేష్ గౌడ్, చాడా బంగారి తదితరులు పాల్గొన్నారు