అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ రద్దు చేయాలని ఎంపీకి వినతి
అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పడకుండా తమ వంతు కృషి చేయాలని రామన్నపేట బీజేపీ నాయకులు మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ను కోరినట్లు బీజేపీ మండల అధ్యక్షుడు పల్లపు దుర్గయ్య తెలిపారు.
దిశ, రామన్నపేట : అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పడకుండా తమ వంతు కృషి చేయాలని రామన్నపేట బీజేపీ నాయకులు మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ను కోరినట్లు బీజేపీ మండల అధ్యక్షుడు పల్లపు దుర్గయ్య తెలిపారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ లోని ఎంపీ నివాసంలో పార్టీ నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశామని తెలిపారు. దీంతో ఎంపీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. అదేవిధంగా రామన్నపేట రైల్వే స్టేషన్ లో భక్తుల, ప్రయాణికుల సౌకర్యార్థం నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ రైలును ఆపాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బండ మధుకర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజ్ కుమార్, కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి భాషాకర్ల నరేందర్ రెడ్డి, రామన్నపేట వి హెచ్ పి ప్రఖండ నోముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.