రైతులకు న్యాయం జరిగే విధంగా చూస్తాం.. ఆర్డీఓ

కృష్ణా నది పై ప్రభుత్వం ఏర్పాటు చేసే లిఫ్టుకు పైప్ లైన్ ఏర్పాటుకు పోయే భూముల రైతులతో హుజూర్ నగర్ ఆర్డీఓ వి.శ్రీనివాసులు పాలకవీడు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు.

Update: 2024-10-17 04:09 GMT

దిశ, నేరేడుచర్ల (పాలకవీడు) : కృష్ణా నది పై ప్రభుత్వం ఏర్పాటు చేసే లిఫ్టుకు పైప్ లైన్ ఏర్పాటుకు పోయే భూముల రైతులతో హుజూర్ నగర్ ఆర్డీఓ వి.శ్రీనివాసులు పాలకవీడు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ లిఫ్టుకు పైప్ లైన్ గుండెబోయిన గూడెం, గుండ్లపహడ్, జాన్ పహాడ్, బోత్తలపాలెం, కోమటికుంట గ్రామాల రైతుల భూముల నుండి వెళ్తుందని తెలిపారు. ఇప్పటికే సర్వేచేశామని ఐదు గ్రామాలకు సంబంధించి 37.20 విస్తీర్ణంలో ఐదు కిలోమీటర్ల పొడవు 3లేదా 4 మీటర్ల లోతు 20 మీటర్ల వెడల్పు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. పైప్ లైన్ భూమి లోపల వెళుతుందని దీనివల్ల రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని, తిరిగి కాంట్రాక్టర్లే దాన్ని పూర్తి వేసి భూమిని యధావిధిగా రైతులకు చదును చేసి అందిస్తారని తెలిపారు. ఆ పైప్ లైన్ తీసే సమయంలో రైతులు ఏమి నష్టపోయిన సంబంధించి అధికారులు వాటి విలువలు వేసి వాటిని తిరిగి అందిస్తారని తెలిపారు. రైతులు భూములు కోల్పోయిన విస్తీర్ణాన్ని బట్టి మార్కెట్ విలువ కంటే రెండు మూడు రెట్లు అధికంగా ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని తెలిపారు. రైతులతో భూములు ఇస్తానికి అంగీకరించారు. కానీ గతంలో సర్వే చేసిన సమయంలో అధికారులు, రైతులకు ఎవరికి తెలియకుండా తమ భూములలో సర్వే చేశారని తమ భూములలో ఎక్కువ విస్తీర్ణంలో పోతుందని కానీ సర్వే చేసిన అధికారులు తక్కువ భూమి కోల్పోతున్నట్టుగా రిపోర్టు రాశారని, అది కాకుండా రైతుల సమక్షంలో మరోసారి సర్వే చేయాలని రైతులు ఆర్డీవోకు తెలిపారు.

రైతులకు అన్యాయం చేయవద్దని రైతును పిలవకుండా సర్వే ఎలా చేశారని రైతులు ప్రశ్నించారు. అలాగే కొందరి రైతుల భూముల నుండి వెళ్తున్నాయని వార్ల పేర్లు కూడా అందులో లేవని చెప్పారు. రైతుల అనుభవదారులకే నష్టపరిహారం అందే విధంగా చూడాలని రైతులు ఆర్డీఓను కోరారు. రైతుల అభిప్రాయాన్ని తెలుసుకున్న ఆర్డీఓ మరోసారి రైతుల సమక్షంలో సర్వే చేసేందుకు అంగీకరించారు. వెంటనే సర్వే అధికారులకు ఫోన్ చేసి గుండెబోయిన గూడెం లిఫ్ట్ పైప్లైన్ ప్రదేశాన్ని మరోసారి సర్వే చేయాలని మీకు ఎప్పుడు వీలుంటుందని అడిగారు. ఈ నెల 18 శుక్రవారం నాడు సర్వేకు వస్తామని, సర్వే అధికారులు ఆర్డీఓకు వివరించారు. ఇదే విషయాన్ని ఆర్డీవో రైతులకు తెలిపారు. రైతులు అందుబాటులో ఉండి సర్వేలో పాల్గొని తమ ఎంత భూమి కోల్పోతుందో అధికారులతో రాయించుకోవాలని రైతులకు సూచించారు. రైతులకు న్యాయం జరిగే విధంగా చూస్తామని ఆర్డీఓ రైతులకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పాలకవీడు తహశీల్దార్ కమలాకర్ ఆర్డీఓ ఆఫీస్ డీటి నాగరాజు రెవెన్యూ అధికారులు సైదులు పాలకవీడు, మాజీ ఎంపీపీ గోపాల్, బెట్టె తండ మాజీ సర్పంచ్ మాలోత్ మోతిలాల్ నాయక్ పైప్ లైన్ వెళ్తున్న భూములకు సంబంధించిన రైతులు పాల్గొన్నారు.


Similar News