రెండో రోజు తహశీల్దార్ జయశ్రీని విచారించిన అధికారులు..

ప్రభుత్వ భూమిని పట్టా చేసుకొని రైతుబంధు పొందిన ధరణి ఆపరేటర్ జగదీష్ తో పాటు ఆయనకు సహకరించారని ఆరోపణలో తహశీల్దార్ జయశ్రీని హుజూర్ నగర్ సబ్ జైల్లో ఉన్న వారిని మంగళవారం ఉదయం సీఐ చరమంద రాజు కస్టడీలోకి తీసుకుని మొదటి రోజు విచారణ చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-10-17 04:18 GMT

దిశ, హుజూర్ నగర్ : ప్రభుత్వ భూమిని పట్టా చేసుకొని రైతుబంధు పొందిన ధరణి ఆపరేటర్ జగదీష్ తో పాటు ఆయనకు సహకరించారని ఆరోపణలో తహశీల్దార్ జయశ్రీని హుజూర్ నగర్ సబ్ జైల్లో ఉన్న వారిని మంగళవారం ఉదయం సీఐ చరమంద రాజు కస్టడీలోకి తీసుకుని మొదటి రోజు విచారణ చేసిన విషయం తెలిసిందే. రెండో రోజు బుధవారం సీఐ చరమందరాజు తహశీల్దార్ జయశ్రీని తన ఆఫీసులో విచారించారు. ఈ విచారణలో పోలీసులకు జయ శ్రీ పూర్తిగా సహకరించినట్లు తెలుస్తుంది. హుజూర్ నగర్ మున్సిపాలిటీకి సంబంధించి విలువైన ప్రభుత్వ భూములను ఎవరి ప్రోద్బలంతో ఎవరెవరికి అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారని ప్రశ్నించినట్లు తెలుస్తుంది.

అలాగే మున్సిపాలిటీ అధికారులకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో ఆరా తీసినట్లు సమాచారం.. ఇందులో అప్పటి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు చెప్పిన విధంగానే తాను చేశానని, తనకు ఎలాంటి ప్రమేయం లేదని జయశ్రీ వివరించినట్లు సమాచారం. ఇందులో తనను వాడుకున్నారే.. తప్ప తనకు ఎలాంటి సంబంధంలేదని వివరించినట్లు తెలుస్తుంది.. దానిలో అంతా పెద్దల హస్తం ఉందని అందుకే తను చేయాల్సి వచ్చిందని.. విచారణలో వెల్లడించినట్లు సమాచారం. మూడోరోజు గురువారం విచారణతో పోలీసులకు కోర్టు ఇచ్చిన కస్టడీ గడువు ముగియనుంది.


Similar News