అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకు వ్యతిరేకంగా నిరసన

అంబుజా సిమెంట్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించారు

Update: 2024-10-19 10:56 GMT

దిశ,రామన్నపేట : అంబుజా సిమెంట్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించారు. రామన్నపేటలో విద్యార్థి సంఘాలు, పాఠశాలల యాజమాన్యాలు, పర్యావరణ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో.. భారీ విద్యార్థి ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు. స్థానిక సుభాష్ సెంటర్లో మానవహారం నిర్వహించి, భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేసే అంబుజా సిమెంట్ ప్యాక్టరీ మాకొద్దు మా భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయొద్దు అంటూ.. విద్యార్థులు పిడికిలి బిగించి నినాదాలు చేశారు. పర్యావరణాన్ని ప్రజా ఆరోగ్యాన్ని విధ్వంసం చేసి దుమ్ము, దూళి ప్రమాదకర రసాయనాలతో వాయు కాలుష్యం చేసి, ప్రాణాంతక వ్యాధులకు కారణమయ్యే కాలుష్య ప్యాక్టరీ నిర్మిస్తే.. విద్యార్థులుగా ఊరుకునేది లేదని హెచ్చరించారు. 23న జరిగే ప్రజాభిప్రాయ సేకరణను విద్యార్థులు అడ్డుకొని నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ వేదిక మండల కన్వీనర్ జల్లెల పెంటయ్య, కో-కన్వీనర్ మహమ్మద్ రెహాన్, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పోచబోయిన మల్లేశం, సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ, సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, మాజీ ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం, టిడిపి నాయకులు ఫజల్ బేగ్, బిఎస్పి నియోజకవర్గ అధ్యక్షులు గూని రాజు, డిఎస్పి నాయకులు నకిరేకంటి నరేందర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు, టీఎంఎస్ఎఫ్ నాయకులు నకిరేకంటి గణేష్, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు గంటేపాక శివకుమార్, పాఠశాలల కరస్పాండెంట్లు, తిరుగుడు మల్లికార్జున్, జెఎస్సి మార్టిన్, గంగుల నరేందర్ రెడ్డి, ప్రజా సంఘాల నాయకులు, ఎస్కే చాంద్, నీలా ఐలయ్య, పోచబోయిన మల్లేశం, శానకొండ వెంకటేశ్వర్లు, మేకల జలంధర్, పుట్టల ఉదయ్ కుమార్, తుర్కపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు.


Similar News