సీసీఐ కేంద్రాల్లోనే ప్రైవేటు కొనుగోలు..గగ్గోలు పెడుతున్న పత్తి రైతులు

ప్రజా పాలన ప్రభుత్వంలో పత్తి రైతుల సంక్షేమ మార్గం సీసీఐ కేంద్రాల

Update: 2024-10-25 08:11 GMT

దిశ, మర్రిగూడ: ప్రజా పాలన ప్రభుత్వంలో పత్తి రైతుల సంక్షేమ మార్గం సీసీఐ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టాడు. ఏఎంసీ పరిధిలో ఉన్న పత్తి మిల్లుల ను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో సైతం పత్తి కొనుగోలు కేంద్రాలను రిబ్బన్ కట్ చేసి కొనుగోలు ప్రారంభించారు. వారం రోజులు దాటినా నేటికీ ఎంపిక చేసిన పత్తి మిల్లుల వద్ద అధికారులు సీసీఐను ఏర్పాటు చేయలేదు. ఎంపిక చేసిన సీసీఐ కేంద్రాల్లోనే ప్రైవేటుగా మిల్లు యాజమాన్యమే క్వింటాలుకు 6200 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని పత్తి ని తీసుకొని వెళ్ళిన రైతులకు ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేయడం తో మద్దతు ధర రాక గగ్గోలు పెడుతున్నారు. మ్యాచర్ చూసే నాధుడు లేడు, ఏఎంసీ పర్యవేక్షణ లేదు .దీంతో పత్తి మిల్లుల యాజమాన్యాలే ప్రైవేట్ గా పత్తిని కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేసి ప్రభుత్వం ఎంపిక చేసిన సీసీఐ కేంద్రాల వద్ద పత్తి రైతు తెచ్చిన పత్తిని మ్యాచర్ చేసి సీసీఐ ద్వారానే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

మర్రిగూడ ,చింతపల్లిలో సీసీఐ కేంద్రాలు ఇవే..

మాల్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. మర్రిగూడ మండలంలో ఎరుగండ్లపల్లి సరంపేట గ్రామాలలో ఉన్న పత్తి మిల్లులను కొనుగోలు కేంద్రాలుగా ఎంపిక చేసింది. అలాగే చింతపల్లి మండలంలో నసర్లపల్లి, నసర్లపల్లి తాండ ,గడియ గౌరారం లో సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఈ కేంద్రాల్లోనే పత్తిని విక్రయించి మద్దతు ధర పొందాలని ప్రభుత్వం సూచించింది.8 శాతం నుంచి 12 శాతం వరకు మ్యాచర్ ఉంటే రూ. 7521 మద్దతు ధర పొందాలని ప్రభుత్వం సూచించింది. దళారులను ఆశ్రయించకుండా సిసిఐ కేంద్రాల్లోనే పత్తిని విక్రయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

సీసీఐ కేంద్రాల్లోనే ప్రైవేటు వ్యాపారం..

ప్రభుత్వం ఎంపిక చేసిన సీసీఐ కేంద్రాల్లోనే ప్రైవేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. మర్రిగూడ మండలం లో ఉన్న ఎరుగండ్లపల్లీ సరంపేట పత్తి మిల్లుల వద్ద సీసీఐ అధికారులు ఎవరూ లేకపోవడం వల్ల ప్రైవేటు వ్యాపారులే క్వింటాకు 6200 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. అక్కడ విక్రయించిన రైతులను దిశ అడుగగా మ్యాచర్ చూసే అధికారులు లేరని ప్రైవేటు వ్యక్తులే పత్తిని కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా సీసీఐ ద్వారానే పత్తిని కొనుగోలు చేయాలని రైతులు అధికారులను కోరుతున్నారు. ఏఎంసీ పరిధిలో ఉన్న సిసిఐ కేంద్రాల్లో అధికారుల పర్యవేక్షణ లోపం గానే సిసిఐ కేంద్రాల్లోనే ప్రైవేటు వ్యాపారం సాగుతుందని రైతులు కంచుకట్ల సుభాష్ ఆరోపిస్తున్నారు.

మాల్ ఏఎంసీ సెక్రటరీ వివరణ..

సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు చేయడం లేదని మాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ వేణు కుమార్ ను బుధవారం దిశ వివరణ కోరగా కొనుగోలు ఎప్పుడో ప్రారంభమైందని మ్యాచర్ రాకపోవడం తో సీసీఐ ద్వారా కొనుగోలు చేయడం లేదని తెలిపారు. మ్యాచర్ రాకపోవడంతో మిల్లులా యాజమాన్యాలే ప్రైవేట్ గా కొనుగోలు చేస్తున్నారని వివరణ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల వద్ద మీ సిబ్బంది లేరని ప్రశ్నించగా తన పరిధిలో తక్కువ సిబ్బంది ఉండటం వల్ల ఈరోజు లేరని జవాబిచ్చారు.


Similar News