అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలు

అకాల వర్షాలు అన్నదాతలకు భారీ నష్టాన్ని చేకూర్చుతున్నాయి.

Update: 2024-10-25 09:35 GMT

దిశ, మిర్యాలగూడ : అకాల వర్షాలు అన్నదాతలకు భారీ నష్టాన్ని చేకూర్చుతున్నాయి.దీంతో నష్టపోయిన రైతుల పొలాలను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పరిశీలించారు. శుక్రవారం మిర్యాలగూడ, దామరచర్ల మండలాల్లో వరి పంట పొలాలను పరిశీలించిన.. అనంతరం మాట్లాడుతూ వర్షాల వలన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డం పడిన పంట పొలాల రైతుల వివరాలను సేకరించి ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం,అదే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఏవో సైదా నాయక్, మన్నెం శ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు. 


Similar News