అర్థనగ్న నిరసన తెలిపిన హమాలీ కార్మికులు..
సివిల్ సప్లయ్ హమాలీ కార్మికులకు పెంచిన కూలీ రెట్ల జీఓను తక్షణమే విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ అన్నారు.
దిశ, రామన్నపేట : సివిల్ సప్లయ్ హమాలీ కార్మికులకు పెంచిన కూలీ రెట్ల జీఓను తక్షణమే విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ అన్నారు. హమాలీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెకు ఆదివారం సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఈ సందర్భంగా 5వ రోజు రామన్నపేట ఎం.ఎల్.ఎస్ గోడౌన్ వద్ద ప్రభుత్వ తీరుకు నిరసనగా అర్ధనగ్నంగా కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. గత సంవత్సరంలో సివిల్ సప్లయ్ అధికారులు, కార్మికులతో జరిపిన చర్చల్లో భాగంగా కూలీ రేట్లు పెంచుతూ జీవో కాఫీ విడుదల చేశారని గుర్తు చేశారు.
కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరి నర్సింహ్మ, సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఎర్ర రమేష్ గౌడ్, ఏఐటీయుసీ మండల అధ్యక్ష, కార్యదర్శులు బత్తుల సత్తయ్య, శివరాత్రి సమ్మయ్య, హామాలీ సంఘం నాయకులు ఏఐటీయుసీ జిల్లా ఉపాధ్యక్షులు గొరిగె నర్సింహ్మ, గొరిగె శంకరయ్య, బండ స్వామి, అంజయ్య, నగేష్, రవి, ఉపేందర్, బాలరాజు, మహేష్, పెంటయ్య, అచ్చాలు, అనిల్, శ్రీను, లింగస్వామి, నర్సింహ్మ స్లీపర్ సరిత తదితరులు పాల్గొన్నారు.