పోలీస్ సిబ్బంది అప్రమత్తతతో వ్యవహరించాలి : రాచకొండ సీపీ

పోలీస్ స్టేషన్లలో సిబ్బంది అన్నివేళలా పూర్తి

Update: 2025-01-05 08:56 GMT

దిశ,యాదాద్రి భువనగిరి ప్రతినిధి : పోలీస్ స్టేషన్లలో సిబ్బంది అన్నివేళలా పూర్తి అప్రమత్తతో వ్యవహరించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సూచించారు. ఆదివారం ఆయన భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ లోని రికార్డులను పరిశీలించడం తో పాటు రిసెప్షన్, పెట్రోలింగ్ స్టాఫ్ వంటి పలు విభాగాల పనితీరు, సీసీటీవీల నిర్వహణ వంటి అంశాలను సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాచకొండ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వివిధ పోలీసు స్టేషన్లలో అధికారులు, సిబ్బంది పనితీరు, సామాన్య ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు.

సమస్యాత్మక ప్రాంతాల సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజేష్ చంద్ర, భువనగిరి ఏసీపీ రాహుల్ రెడ్డి, రూరల్ సీఐ చంద్రబాబు, రూరల్ ఎస్ హెచ్ ఓ సంతోష్ కుమార్ లు ఉన్నారు.


Similar News