డ్యూటీలో ఉన్న ఉద్యోగుల పై దాడి చేసిన వ్యక్తికి ఏడాది జైలు శిక్ష..

డ్యూటీలో ఉన్న ఉద్యోగుల పై దాడి చేసిన వ్యక్తికి ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ.1500 జరిమానాను విధిస్తూ భువనగిరి పీఆర్ఎల్జేఎఫ్సీఎం కోర్టు తీర్పునిచ్చింది.

Update: 2023-04-26 14:05 GMT
డ్యూటీలో ఉన్న ఉద్యోగుల పై దాడి చేసిన వ్యక్తికి ఏడాది జైలు శిక్ష..
  • whatsapp icon

దిశ, ఎంతుర్కపల్లి : డ్యూటీలో ఉన్న ఉద్యోగుల పై దాడి చేసిన వ్యక్తికి ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ.1500 జరిమానాను విధిస్తూ భువనగిరి పీఆర్ఎల్జేఎఫ్సీఎం కోర్టు తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే తుర్కపల్లి మండలం ధర్మారం గ్రామ పరిధిలోని కర్షల గడ్డ తండాకు చెందిన గుగులోతు ప్రభాకర్ తండాలో ప్రభుత్వ వాటర్ ట్యాంకులో గల నీళ్లను తండావాసులకు అందనివ్వకుండా చేస్తున్నాడు. దీంతో తండావాసులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై మధుసూదన్ రెడ్డి పోలీసులతో కలిసి తండాకి వెళ్లి పరిశీలించారు. ఈ నేపథ్యంలో గుగులోతు ప్రభాకర్ పోలీసు సిబ్బంది పై దాడి చేసినందుకు యత్నించారు. దీంతో పోలీసులు కేసునమోదు చేసినట్లు తెలిపారు. మంగళవారం పూర్తయిన విచారణలో జడ్జి ఒక సంవత్సరం జైలుశిక్ష, రూ.1500 జరిమాను విధించినట్టు ప్రస్తుత ఎస్సై రాఘవేందర్ గౌడ్ తెలిపారు.

Tags:    

Similar News