Miryalaguda MLA : గర్భిణీ మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు

గర్భిణీ మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా

Update: 2024-09-23 09:38 GMT

దిశ, మిర్యాలగూడ : గర్భిణీ మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మిర్యాలగూడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి పేషెంట్లు హాస్పిటల్ కి వస్తున్నారు. కావున సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. ఉదయం 10 గంటల వరకు ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంటూ వారికి త్వరగా వైద్యం అందేలా చూడాలన్నారు. హాస్పిటల్ కి వచ్చిన గర్భిణీ మహిళలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని, వారిని ఎక్కువ సమయం వెయిటింగ్ చేయించకూడదు అని సూచించారు. ఆయన వెంట హాస్పిటల్ సూపర్డెంట్ శ్రీనివాస్ సమరద్, సిబ్బంది తదితరులున్నారు. 


Similar News