చిట్టా రాసి పెట్టుకోండి వడ్డీతో సహా చెల్లిద్దాం.. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
చిట్టా రాసి ఉంచండి వడ్డీతో సహా చెల్లిద్దాం అని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
దిశ, మేళ్లచెరువు : చిట్టా రాసి ఉంచండి వడ్డీతో సహా చెల్లిద్దాం అని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో మేళ్లచెరువు మండలం మేళ్లచెరువు, వెంకట్రాంపురం గ్రామాలకు చెందిన 150 మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార పార్టీలో గెలుపొంది ప్రజలకు ఉపయోగపడే పనులు చేయకుండా వారి సొంత ప్రయోజనాలకే పనిచేస్తున్నారని అన్నారు.
దళితులకు 3 ఎకరాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, గృహలక్ష్మి, రుణమాఫీ, వంటి పథకాలు ప్రజలకు అందుబాటు లేకుండా పోయాయని ఆయన అన్నారు. సేవ పేరుతో గెలుపొంది దాచుకోండి, దోచుకోండి అనే రీతిలో వారి పరిపాలన సాగిందని అన్నారు. డిసెంబర్ మొదటి వారంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందని అభివృద్ధితోపాటు ప్రజాసంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుత పాలకులు పోలీసులు అడ్డపెట్టుకొని గ్రామాల్లో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారి చిట్టా రాసుకొని రాబోయే రోజుల్లో వడ్డీతో సహా చెల్లిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.