పూర్తిగా ధ్వంసమైన డ్రైనేజీ.. పట్టించుకోని అధికారులు..!

గత ఆరు నెలలుగా డ్రైనేజీ పైకప్పు ధ్వంసం అయినా గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు.

Update: 2024-12-21 05:55 GMT

దిశ, రామన్నపేట : రామన్నపేటలో  గత ఆరు నెలలుగా డ్రైనేజీ పైకప్పు ధ్వంసం అయినా గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. నిత్యం ప్రజలు తిరిగే ప్రధాన వీధి కావడంతో చీకట్లో వెళ్లే పాదచారులు, వాహనదారులు ఎప్పుడేం ప్రమాదం జరుగుతుందోనని భయంతో ప్రయాణిస్తున్నారన్నారు.

డ్రైన్ పై కప్పు కూలిపోవడంతో ప్రమాదకరంగా మారిందన్నారు. పొరపాటున రాత్రిపూట ఎవరైనా అటుగా వెళ్లాలంటే అందులో పడే ప్రమాదం ఉందన్నారు. డ్రైనేజీ పూర్తిగా కూలిపోవడంతో మురికి నీరు నిల్వ ఉండడంతో దుర్వాసన వెదజల్లుతుందని,   దోమలకు ఆవాసంగా మారి కాలని వాసులు అనేక రోగాల బారిన పడుతున్నారని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే డ్రైనేజీకి మరమ్మతులు చేపట్టాలని కాలనీవాసులు కోరుకుంటున్నారు.


Similar News