గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేసిందని కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి ఉత్తం అన్నారు.

Update: 2024-11-15 12:56 GMT

దిశ,కోదాడ : గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేసిందని కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి ఉత్తం అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో ఉన్న గౌడ్ సోదరులకు ఎక్సైజ్ శాఖ, బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో..గీత కార్మికులకు కాటమయ్య కిట్లు పంపిణీ చేసి మాట్లాడారు. గీత కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తాయన్నారు. మొదట విడుదల భాగంగా 95 కిట్లు పంపిణీ చేశామన్నారు. ప్రమాదవశాత్తు తాటి చెట్టు నుంచి కింద పడిపోకుండా గౌడన్న రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కిట్లు పంపిణీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ అనసూర్య, కౌడిన్య సంఘం రాష్ట్ర ప్రభుత్వ అధ్యక్షులు కే ఎల్ ఎన్ ప్రసాద్ గౌడ్, ఎక్సైజ్ శాఖ సూపర్డెంట్ లక్ష్మానాయక్, ఎక్సైజ్ శాఖ సిఐ మాడుగుల శంకర్, అసిస్టెంట్ బిసి డెవలప్మెంట్ ఆఫీసర్ లు జి .జ్యోతి, గామయ్య, సైదులు, రాంబాబు, నసీమా, త్రివేణి తదితరులు పాల్గొన్నారు


Similar News