ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి

శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భగవంతుని ప్రార్ధించినట్లు తెలిపారు.

Update: 2024-11-15 12:50 GMT

దిశ,సంస్థాన్ నారాయణపురం : శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భగవంతుని ప్రార్ధించినట్లు తెలిపారు. ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమి సందర్భంగా..యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చిల్లాపురంలో శ్రీ రామలింగేశ్వర స్వామి జాతరను నిర్వహిస్తారు. జాతర సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం గుట్ట పైకి నడుచుకుంటూ..వెళ్లి రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు జనగాం గ్రామంలో అంబేద్కర్ ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా ఆరు లక్షల రూపాయలు మంజూరు చేసిన ఎమ్మెల్యే కాలనీవాసులకు ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాల్ డిజైన్ రూపొందించి ఎస్టిమేషన్ పంపించాలని స్థానిక నాయకులను ఆదేశించారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అయ్యే అదనపు నిధులను కూడా పూర్తిగా మంజూరు చేయిస్తానని ఆయన హామీ ఇవ్వడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా అంబేద్కర్ భవనం చుట్టూ ఆధునీకరణ పనులు కూడా చేయిస్తానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. 40 సంవత్సరాలుగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నిరీక్షిస్తున్నామని ఇప్పుడు ఆ కల సాకారం కావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యేకు కాలనీవాసులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జక్కలి ఐలయ్య యాదవ్, మండలపార్టీ అధ్యక్షుడు కరంటోతూ శ్రీను నాయక్,నాయకులు మందుగుల బాలకృష్ణ,గుత్త ఉమా ప్రేమ్చందర్ రెడ్డి, కరెంటోతూ బిక్షపతి నాయక్, ముద్దంగుల నరసింహ, దొంతి మాధవరెడ్డి,వాంకుడోతూ బుజ్జి,ఉప్పల లింగస్వామి, కొర్ర లచ్చిరాం, మెరుగు పెద్ద జంగయ్య,మేకల రవి,రమేష్, పడ్సగోని నరసింహ,జక్కలి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.


Similar News