మార్కెట్ కు వరుసగా నాలుగు రోజులు సెలవు

తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కు నాలుగు రోజులు సెలవులు ప్రకటించడం జరిగిందని మార్కెట్ కార్యదర్శి శ్రీధర్ తెలిపారు.

Update: 2024-10-09 14:32 GMT

దిశ తిరుమలగిరి: తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కు నాలుగు రోజులు సెలవులు ప్రకటించడం జరిగిందని మార్కెట్ కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సమస్త రైతు సోదరులకు వ్యాపారస్తులకు,గుమస్తాలకు,దడువాయిలతో పాటు.. కార్మికులకు తేదీ:10-10-2024 గురువారం రోజున దుర్గాష్టమి (సద్దుల బతుకమ్మ)11-10-2024 శుక్రవారం రోజున మహర్నవమి,12-10-2024 ,శనివారం రోజున దసరా పండుగ సందర్భంగా.. 13-10-2024 ఆదివారం రోజున వారాంతపు సేలువులన్నారు. ఈ నాలుగు రోజులు మార్కెట్ యార్డుకు సెలవులు ప్రకటించడం జరిగిందన్నారు. ఈ సెలవు దినాలలో మార్కెట్ యార్డ్ గేటు తీయబడదన్నారు. ఈ సెలవు రోజులలో రైతు సోదరులు మార్కెట్ యార్డుకు ఎలాంటి సరుకులు తీసుకురాకుండా చూసుకునే బాధ్యత ప్రతి కమిషన్ దారుని పైన ఉన్నదన్నారు. ఒకవేళ సరుకులు తెస్తే..రైతుకు, సరుకులకు కమిషన్ దారుడే బాధ్యత వహించవలసి ఉంటుందన్నారు.


Similar News