పోలీస్‌ కస్టడీకి మాజీ తహసీల్దార్‌ జయశ్రీ

ప్రభుత్వ భూముల అక్రమ బదలాయింపు కేసులో రిమాండ్‌లో ఉన్న సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మాజీ తహసీల్దార్‌ వజ్రాల జయశ్రీని హుజూర్‌నగర్‌ కోర్టు పోలీ్‌సకస్టడీకి అనుమతిచ్చింది.

Update: 2024-10-11 15:10 GMT

దిశ హుజూర్ నగర్ : ప్రభుత్వ భూముల అక్రమ బదలాయింపు కేసులో రిమాండ్‌లో ఉన్న సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మాజీ తహసీల్దార్‌ వజ్రాల జయశ్రీని హుజూర్‌నగర్‌ కోర్టు పోలీ్‌సకస్టడీకి అనుమతిచ్చింది. జయశ్రీ 36.23 ఎకరాల ప్రభుత్వ భూమిని ధరణి కంప్యూటర్‌ ఆపరేటర్‌ కుటుంబసభ్యులకు బదలాయించి దాదాపు రూ.14 లక్షల మేర రైతుబంధు లబ్ధి పొందిన సంగతి తెలిసిందే.ఇదే విషయమై తహసిల్దార్ జయశ్రీని బుధవారం హుజూర్ నగర్ సిఐ చరమందరాజు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. ఆమె నుంచి పూర్తి సమాచారం సేకరించేందుకు తమకు కస్టడీకి ఇవ్వాలని గురువారం హుజూర్ నగర్ సిఐ చరమందరాజు కోర్టుకు విన్నవించుకున్నారు. వారి అర్జీని స్వీకరించిన హుజూర్ నగర్ జడ్జి మారుతి ప్రసాద్ ఒక్కరోజు విచారణ చేసేందుకు టైం ఇచ్చారు.

హుజూర్ నగర్ తాహసిల్దార్ వజ్రాల జయశ్రీ ని హుజూర్ నగర్ సబ్ జైల్ నుంచి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4-30 గంటల వరకు సిఐ చరమంద రాజు కస్టడీలోకి తీసుకొని విచారణ చేశారు. కస్టడీలో పలు ప్రశ్నలను అడిగినట్లు సమాచారం.2019 సంవత్సరంలో 36 ఎకరాల 23 కుంటల భూమికి సంబంధించి.. సుమారు 14 లక్షల రూపాయలను రైతుబంధుతో తీసుకున్నారని ఈ డబ్బులను ఏ అకౌంట్ తో ఉపయోగించారని ప్రశ్నించారు. తమరు మాకు ఇచ్చిన అకౌంట్లో దానికి సంబంధించిన ట్రాన్జక్షన్స్ లేదని ..మరి ఏ అకౌంట్లో ఇంకా మీకు ఉన్నాయని ఆరా తీసినట్లు తెలిసింది. అయితే విచారణ ఆమె హుజూర్ నగర్ సంబంధించి మరో బ్యాంకులో అకౌంట్లో ఉన్నట్లు విచారణలో వెల్లడించిందని తెలుస్తుంది. ఆ అకౌంట్లో కూడా పోలీసులు తీసుకున్నట్లు సమాచారం. ధరణి ఆపరేటర్ నీకు మధ్య ఎన్ని సార్లు ట్రాన్సాక్షన్స్ జరిగింది.. ? ఏ విధంగా జరిగింది..? మీకున్న కమ్యూనికేషన్ ఏందని ప్రశ్నించినట్లు తెలుస్తుంది. మీ ఆఫీసులో ప్రతిరోజు లాగిన్ అయ్యే బయోమెట్రిక్ (తంబు మిషన్ )ఆఫీసులో లేదని అది ఎక్కడ పెట్టారు అని ప్రశ్నించారు. అయితే ఈ కేసు బయటికి రాగానే భయపడి తను ఆ బయోమెట్రిక్ మిషన్ ను నేరేడుచర్ల లోని తన ఇంట్లో ఉంచినట్లు విచారణ వెల్లడించినట్లు తెలిపారు. దీంతో బూరుగడ్డకు చెందిన పంచాయతీ కార్యదర్శులను సమక్షంలో నేరేడుచర్ల పోలీసులు స్వాధీన పరచుకున్నట్లు తెలిసింది. తహసిల్దార్ జయశ్రీ ఇన్వెస్టిగేషన్ పూర్తిగా కాలేదని ..మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరినట్లు తెలుస్తుంది. అయితే శనివారం హుజూర్ నగర్ జడ్జి అందుబాటు లేకపోవడంతో .. కోదాడ జడ్జి ముందు హాజరుపరిచి మళ్లీ సాయంత్రం 5 గంటలకు రిమాండ్ కి పంపించినట్లు సమాచారం.


Similar News