ఈ నెల 20న తుంగతుర్తికి ఈవీఎంలు రాక
వచ్చే నెలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 20న తుంగతుర్తికి ఈవీఎంలు రాబోతున్నాయని సూర్యాపేట జిల్లా జాయింట్ కలెక్టర్, తుంగతుర్తి అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
దిశ, తుంగతుర్తి : వచ్చే నెలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 20న తుంగతుర్తికి ఈవీఎంలు రాబోతున్నాయని సూర్యాపేట జిల్లా జాయింట్ కలెక్టర్, తుంగతుర్తి అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. మొత్తంగా 9 మండలాలకు సంబంధించి 326 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయని, ఈ మేరకు 326 ఈవీఎంలతో పాటు అదనంగా మరో 20 శాతం ఈవీఎంలు వస్తాయని వెల్లడించారు. బుధవారం తుంగతుర్తిలో జరిగిన వివిధ రాజకీయ పక్షాల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ గోదాములను డిస్ట్రిబ్యూషన్ సెంటర్ గా ఎంపిక చేసామని ఈ మేరకు అందులోనే ఎన్నికల సామాగ్రి భద్రపరుస్తున్నట్లు తెలిపారు. ఎన్నిక పూర్తయ్యాక ఈవీఎంలను సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ గోదాములకు తరలిస్తామని, అక్కడే కౌంటింగ్ కూడా జరుగుతుందని ఆయన వివరించారు. ముఖ్యంగా ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ప్రతి ఒక్కరు సహకారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి యాదగిరి రెడ్డి, డీటీ హరిచంద్ర ప్రసాద్ తోపాటు పలువురు పాల్గొన్నారు. అంతకుముందు ఎన్నికల స్ట్రాంగ్ రూమును వివిధ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.