కోదాడ మెడికల్ షాపుల్లో డ్రగ్స్ అధికారుల దాడులు

కోదాడ పట్టణంలో డ్రగ్స్ కంట్రోల్ డీజీ కమలహాసన్ రెడ్డి ఆదేశాల మేరకు పలు మెడికల్ షాపుల్లో అధికారులు ఏక కాలంలో సోమవారం దాడులు చేశారు.

Update: 2024-03-11 16:39 GMT

దిశ, కోదాడ: కోదాడ పట్టణంలో డ్రగ్స్ కంట్రోల్ డీజీ కమలహాసన్ రెడ్డి ఆదేశాల మేరకు పలు మెడికల్ షాపుల్లో అధికారులు ఏక కాలంలో సోమవారం దాడులు చేశారు. 9 మంది 4 బృందాలుగా ఏర్పడి మెడికల్ షాపులకు అనుబందంగా ఉన్నటువంటి గోదాములను ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసి వాటిలో మందులను నిలువ ఉంచడం నేరమని వారన్నారు. దీనిపై తనిఖీలు చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం నిషేధించిన మందులను విచ్చలవిడిగా మెడికల్ షాపుల్లో లభ్యం అవుతుండటం దాడులకు ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. ఇటీవల కోదాడ పరిసర ప్రాంతాలల్లోని మెడికల్ షాపుల్లో డ్రగ్స్ మోతాదు అధికంగా ఉండే దగ్గు మందు సీసాలు, టాబ్లెట్లను ఆబ్కారీ శాఖ, జిల్లా డ్రగ్స్ అధికారులు పట్టుకున్న నేపథ్యంలో దాడులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ దాడుల్లో సుమారు రూ. 33 లక్షల రూపాయల మందులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నాలుగు ఏజెన్సీలు ఒక ఆసుపత్రి పై దాడులను నిర్వహించారు. ఈ దాడులలో డిప్యూటీ డైరెక్టర్ రాజ్యవర్ధన్ చారి, నల్గొండ ఏడి కే దాసు, ఖమ్మం అసిస్టెంట్ డైరెక్టర్ జి . ప్రసాద్, సూర్యాపేట జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ జి సురేందర్, నల్గొండ జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమేశ్వర్, భువనగిరి జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ అశ్విన్, జనగామ జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, హనుమకొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ జై కిరణ్, ఖమ్మం జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ సీహెచ్. అనిల్ కుమార్ ఈ దాడుల్లో పాల్గొన్నారు.


Similar News