అందరు మెచ్చిన పత్రిక "దిశ".. మార్కెట్ కమిటీ చైర్మన్..
పత్రికా రంగంలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని, ప్రజలందరూ మెచ్చిన పత్రికగా దిశ ఎదుగుతున్నదని తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి అన్నారు.
దిశ, నూతనకల్ : పత్రికా రంగంలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని, ప్రజలందరూ మెచ్చిన పత్రికగా దిశ ఎదుగుతున్నదని తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఆయన ఇంటి ఆవరణలో దిశ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దిశ దినపత్రిక అతి తక్కువ సమయంలో అందరి ఆదరాభిమానాలు పొందిందన్నారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. వాస్తవాలు వ్రాసే పత్రికగా సామాన్యుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే పత్రికగా మంచి గుర్తింపు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ బత్తుల నాగమల్లు, జిల్లా నాయకులు సుదర్శన్ రెడ్డి, బండపల్లి సాగర్, మరికంటి వెంకన్న, చిల్పకుంట్ల గ్రామ కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ బత్తుల రమేష్, సత్యనారాయణ, ప్రణయ్ తదితరులు ఉన్నారు.