దిశ ఎఫెక్ట్... కేజీబీవీని సందర్శించిన డిప్యూటీ డీఎంహెచ్ఓ
మండల పరిధిలోని కేజీబీవీలో మెరుగైన భోజనం పెట్టకపోవడం, తరచూ ఫుడ్ పాయిజన్ తో బాలికలు అనారోగ్యం పాలవుతున్న విషయాన్ని దిశ దిన పత్రిక వెలుగులోకి తెచ్చిన విషయం విధితమే.
దిశ, శాలిగౌరారం : మండల పరిధిలోని కేజీబీవీలో మెరుగైన భోజనం పెట్టకపోవడం, తరచూ ఫుడ్ పాయిజన్ తో బాలికలు అనారోగ్యం పాలవుతున్న విషయాన్ని దిశ దిన పత్రిక వెలుగులోకి తెచ్చిన విషయం విధితమే. ఈ కథనానికి పలువురు ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మధ్యనే మండల విద్యాధికారి ఎం. నాగయ్య, జిల్లా మలేరియా అధికారి దుర్గయ్య కేజీబీవీ పాఠశాలను పలు సందర్భాలలో సందర్శించి విద్యార్థినులు తరచూ అనారోగ్యం పాలవుతున్న విషయాన్ని ఎస్ ఓ తదితర పాఠశాల సిబ్బందికి తగు సూచనలు చేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థినులకు వైద్య పరీక్షలు చేయించి, తగిన మందులు ఇవ్వాలని ఆదేశించారు.
కేజీబీవీలో పలువురు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైన విషయాన్ని తెలుసుకున్న డిప్యూటీ డీఎంహెచ్ ఓ వేణుగోపాల్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా కేజీబీవీ పాఠశాలను సందర్శించి విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాలని, సీజనల్ వ్యాధులు ప్రబలుతుండటం తో జాగ్రత్తగా ఉండాలని సిబ్బందికి సూచించారు. పాఠశాల లో 200 మంది విద్యార్థులు ఉన్నారని, వారికి మెనూ పాటిస్తూ నాణ్యమైన భోజనం అందజేయాలని కోరారు. పాఠశాల వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిలిచి ఉన్న మురుగునీటిని తొలగించాలని, విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం నిర్వహించే గర్భిణి మహిళ లకు పౌష్టికాహారం అందచేత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ జ్యోతి లక్ష్మి, వైద్యాధి కారి శిల్ప, రాములమ్మ, మరియ, బుడిగె శ్రీనివాసులు, డెంకల సత్య నారాయణ, చామల మహేందర్ రెడ్డి, ఏ ఎన్ ఎమ్ లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.