ధాన్యం కొనుగోలులో జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపుతాం : మంత్రి వెంకటరెడ్డి

ధాన్యం కొనుగోలులో జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో

Update: 2025-04-01 16:13 GMT

దిశ,కనగల్లు: ధాన్యం కొనుగోలులో జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుపుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని జీ.యడవల్లి గ్రామంలో సెర్ప్ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని శుభ్రం చేసి,ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.ప్రభుత్వం సన్న ధాన్యం కొనుగోలుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు.సన్న ధాన్యానికి ఇస్తున్న 500 బోనస్ సద్వినియోగం చేసుకోవాలన్నారు. యాసంగిలో జిల్లాలో 375 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ,ధాన్యం రాకను బట్టి అవసరమైతే మరిన్ని కేంద్రాలు పెంచుతామన్నారు.

మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఉగాదినాడు హుజూర్నగర్ లో రేషన్ కార్డుదారులకు సన్నబియాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని ఈ రోజు మన గ్రామంలో సన్నబియాన్ని ప్రారంభించుకుంటున్నామని అన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఐకేపీ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతులను ఇబ్బందులకు గురి చేస్తే నిర్వాహకులపై చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డిఓ శేఖర్ రెడ్డి, ఏపీఎం సంకు హరి, ప్రభాకర్,మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, అనూప్ రెడ్డి, రాజు రెడ్డి, గోలి జగాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Similar News